V6 News

Good Health : ఒక్కసారిగా సిగరెట్, మందు మానేస్తే ఏమౌతుంది.. ఎలా డీల్ చేయాలో తెలుసుకోండి..!

Good Health : ఒక్కసారిగా సిగరెట్, మందు మానేస్తే ఏమౌతుంది.. ఎలా డీల్ చేయాలో తెలుసుకోండి..!

చాలామంది చైన్​ స్మోకింగ్​.. అతిగా మద్యం సేవించడం వంటి వాటికి బానిసవుతారు.  ఇలాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసినా అలవాటు మానుకోరు.  ఏదో ఆరోగ్య సమస్య వస్తే హుటా హుటిన డాక్టర్​ దగ్గరకు పరిగెత్తుకెళతారు.  అప్పుడు డాక్టర్లు కచ్చితంగా ఇచ్చే సలహా ఇదే.. ముందు మీరు సిగరెట్​.. లిక్కర్​ మానేయమంటారు. కాని  అది అంత ఈజీగా మానలేరు.  అయితే ఇవి మానేస్తే ఏం జరుగుతుంది.. ఎలా వీటికి దూరంగా ఉండాలి మొదలగు అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

ఆల్కహాల్, సిగరెట్లకు బానిసలైన వాళ్లకు, అవి ఉన్నట్టుండి దొరక్కపోతే 'విత్ డ్రాయల్ సింప్టమ్స్' కనిపిస్తాయి.  ఈ లక్షణాలతో బాధపడుతూ, ఆసుపత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ సమస్యను దాటగలగడం అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు.

రెగ్యులర్​గా తీసుకునే ఆల్కహాల్ నికోటిన్ల పరిమాణం, బాధితుల బయలాజికల్ అంశాల ఆధారంగా లక్షణాలుంటాయి. కాళ్లు చేతులు వణకడం, తలనొప్పి, జీర్ణ సమస్యలు, వాంతులు, చెమట, వికారం, తిమ్మిర్లు వంటి శారీరక లక్షణాలు, మతిమరుపు, మూర్ఛ, డిప్రెషన్, యాంగ్జెటీ, చిరాకు, నిద్రపట్టకపోవడం వంటి మానసిక లక్షణాలు కనిపిస్తాయి. ఏ సమస్యలున్నా డాక్టర్ ను  కలవాలి.

వీటితో దూరం: ఆల్కహాల్, నికోటిన్ వంటి డ్రగ్స్ దొరక్కుండా ఇబ్బంది పడుతున్న వాళ్లెవరైనా హ్యాపీగా, హెల్దీగా ఉండాలంటే ఈ పద్ధతుల్ని పాటించాలని ఎక్స్​ పర్ట్స్ చెప్తున్నారు.

చూయింగ్ గమ్: సిగరెట్ మానేసేందుకు ఇది చాలా ఈజీ మెథడ్. మెడికల్ షాపుల్లో దొరికే నికోటిన్ చూయింగ్ గమ్స్ రెగ్యులర్ గా వాడితే, స్మోక్ చేయాలన్న ఆలోచన చాలావరకు తగ్గుతుంది. చూయింగ్ గమ్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల లాజెంజెస్, క్రంచెస్ వంటివి దొరుకుతున్నాయి. వీటిని నోట్లో వేసుకుని చప్పరిస్తే, మెల్లిగా పొగతాగే అలవాటు దూరమవుతుంది.

బ్రెయిన్ గేమ్స్: మందు, సిగరెట్ తాగాలనే ఆలోచన వచ్చేది మెదడునుంచే   అందుకే మెదడుకు పని చెప్పే పనులు చేస్తే, ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడొచ్చు. ఇందుకోసం సుడోకు, క్రాస్ వర్డ్స్​ పజిల్స్ వంటి బ్రెయిన్ గేమ్స్ ఆడితే కొంత ఫలితం ఉంటుంది.

ఆర్ట్ థెరపీ: ఏదైనా ఒక క్రియేటివ్ ఆర్ట్ ను ప్రాక్టీస్ చేయడం ద్వారా 'విత్ డ్రాయల్ సింప్టమ్స్' రాకుండా చూసుకోవచ్చని ఎక్స్​ పర్ట్స్​ సూచిస్తున్నారు. డిప్రెషన్, మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లెందరి జీవితాల్లోనో క్రియేటివ్ ఆర్ట్ మార్పు తీసుకొచ్చింది.

ఫ్రెండ్స్, ఫ్యామిలీ సాయం: మందు, సిగరెట్ దొరక్కపోవడం వల్ల ప్రవర్తనలో ఎక్కువ మార్పులు వచ్చాయనిపిస్తే వెంటనే కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్​హెల్ప్ తీసుకోవాలి. వాళ్ల సహకారంతో కౌన్సెలర్ డాక్టర్​ను  కలిసి సరైన ట్రీట్ మెంట్ తీసుకోవాలి.

మరిన్ని టెక్నిక్స్ : ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇంకొన్ని టెక్నిక్స్ కూడా ఫాలో అవ్వొచ్చు. సెల్ఫ్-హిప్నోసిస్ ను  రోజూ కనీసం పది నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. అలాగే మెడిటేషన్, చక్రాస్ ప్రాక్టీస్ చేసినా ఫలితం ఉంటుంది.

వెలుగు,లైఫ్​